ఓనమ్‌ శుభాకాంక్షలు తెలపిన రాష్ట్రపతి తదితరులు

తిరువనంతపురం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): కేరళలో ఓనమ్‌ పండుగను జరుపుకుంటున్న వేల పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌.. ఆ రాష్ట్ర ప్రజలకు ఓనమ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడిప్పుడే వరద ప్రభావం నుంచి కోలుకుంటున్న రాష్ట్ర ప్రజలు.. అక్కడక్కడ ఓనమ్‌ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయాన్ని వేల సంఖ్యలో జనం దర్శించుకున్నారు. చెంగనూరులోని రిలీఫ్‌ క్యాంపులో.. ఓనమ్‌ ప్రత్యేక సంబరాలను నిర్వహిస్తున్నారు. కేరళలోని అనేక ఆలయాలను ముస్తాబు చేశారు. వరద విషాదం దృష్ట్యా.. కొందరు పండుగకు దూరంగా ఉన్నారు. రామరోవైపు వరద బాధిత కుటుంబాలకు.. భారతీయ వాయుదళం భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితులను ఆదుకోవడంలో ముందున్న భారత వాయుసేన .. ఆ రాష్ట్ర సీఎం విజయన్‌కు 20 కోట్ల చెక్కును అందజేసింది. ఎయిర్‌మార్షల్‌ సురేశ్‌ ఆ చెక్కును సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేరిట జారీ చేశారు.

 

 

 

 

తాజావార్తలు