కడం ప్రాజెక్టు ముంపు భూములకి పరిహారం ఇవ్వాలి
కడెం జూలై 17( జనం సాక్షి
భారీ వర్షాల కారణం గా కడం ఆయకట్టు కింద భూములు వరద తాకిడి కి పంట భూములు వ్యవసాయం కి పనికి రాకుండా పోయిన భూములని గుర్తించి ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇవ్వాలని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రభుత్వం ని డిమాండ్ చేసారు
ఆదివారం కడం కాంగ్రెస్ నాయకులతో ప్రాజెక్టు సందర్శించి ముంపు కి గురి అయిన ప్రాంతo లని చూసారు వారు మాట్లాడుతు ప్రాజెక్టు సిబ్బంది కొరత ఉండడం తో ప్రాజెక్టు పనులు సకాలంలో చేయాలెక ఇలాంటి సంఘటన జరుగిoదని అన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు సిబ్బంది ని అధిక సంఖ్యలో పెట్టి ప్రాజెక్టు ఫై మరమ్మత్తులని చేయాలని డిమాండ్ చేసారు
ఈ కార్యక్రమం లో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెడ్మ బొజ్జు. కడం మండల పరిషత్ మాజీ ఉపాధ్యాక్షులు సంతోష్ రెడ్డి
నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి యువజన కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు కిషోర్ నాయక్. జన్నారం మండల అధ్యక్షులు ప్రభుదాస్. కౌన్సిలర్ షబ్బీర్ పాష. జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి షాబీర్ పాష. మైనారిటీ మండల అధ్యక్షులు బబ్లు. నాయకులు గుండా నరేష్ సత్యం చారి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు