కడియం చేరికతో తెలంగాణ వస్తుందా? : పొన్నాల
వరంగల్: కడియం శ్రీహరి తెరాసలో చేరినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా? అని మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. హన్మకొండలోని పొన్నాల నివాసంలో తెరాస నుంచి కాంగ్రెస్‌లో పలువురు పార్టీ కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ తెలంగాణ కోసం పార్టీని స్థాపించి కేసీఆర్ పోరాటం చేస్తున్నారాని తెలంగాణ కడియంతో ఎలా వస్తుందని ప్రశ్నించారు.