కత్తులతో బెదిరించి..దోచుకెళ్లారు
వరంగల్ : ఇంట్లో ఉన్న దంపతులను కత్తులతో బెదిరించి వారి నుంచి 7 తులాల బంగారంతో పాటు నగదును దుండగులు అపహరించుకుపోయారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగింది. వివరాలు పాలకుర్తికి చెందిన గట్లు బాలనర్సయ్య కిరాణా దుకాణం నిర్వహిస్తుంటాడు. బుధవారం రాత్రి బాలనర్సయ్య, భార్యతో కలసి ఇంట్లో టీవీ చూస్తుండగా గుర్తు తెలియని నలుగురు ఆగంతుకులు ఇంట్లో ప్రవేశించారు. దంపతులను కత్తులతో బెదిరించి వారి వద్ద నున్న రూ. 60వేల నగదు, 7తులాల బంగారు ఆభరణాలు లాక్కొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు డీఎస్సీ కె. సురేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.