‘కన్నెధార గనులపై సర్వే చేయించండి’

హైదరాబాద్‌; కన్యెధార లీజు వ్యవహారంలో శ్రీకాకుళం కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌ ఇతర జిల్లా సిబ్బంది లోకాయుక్త ముందు హాజరయ్యారు. ఇవాళ కేసును విచారించిన కోర్టు కన్నెధారలో గ్రానైట్‌ గనులున్న భూములను సర్వే చేయించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.కాగా, మంత్రి ధర్నాన ప్రసాద్‌రావు తనయుడు రామమనోహర్‌రావుకు కేటాయించిన కన్నెధార గ్రానైట్‌ లీజు వ్యవహారంలో తమ ముందు హాజరుకావాలని గతంలో కలెక్టర్‌కు లోకాయుక్త ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.