కన్నెధార గ్రానైట్‌ కౌలు వ్యవహారంపై విచారణ చేపట్టనున్న లోకాయుక్త

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన తనయుడు రామమనోహర్‌ నాయుడుకి కేటాయించిన కన్నెధార గ్రానైట్‌ కౌలు వ్యవహారంపై లోకాయుక్త విచారణ చేపట్టనుంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌, అధికారులు లోకాయుక్త ముందు హాజరయ్యారు. కన్నెధార గ్రానైట్‌ గనులపై సర్వే చేయాలని కలెక్టర్‌ను లోకాయుక్త ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 26కు వాయిదా వేసింది.