కపీహెచ్‌బీలో హోటల్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్;నగరంలో జరుగుతోన్న వరుస అగ్ని ప్రమాదాలతో నగర ప్రజలే బెంబేలెత్తిపోతున్నారు. కెపీహెచ్‌బీలోని స్వాగత్ హోటల్లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తోన్నారు.ప్రమాదానికి గల కారణాలను తెలియాల్సి ఉంది.