కరీం పేటలో ప్రజాప్రతినిధుల, అధికారుల పర్యటన

శంకరపట్నం జనం సాక్షి
గ్రామస్తులు అధైర్య పడకుండ, మనోధైర్యముతో ఉండాలని, శంకరపట్నం జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మండలములోని కరీంపేట గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, శంకరపట్నం జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. కరీంపేట గ్రామంలో సీజనల్ గా జ్వరాలు సంభవిస్తున్నట్లు, తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. గ్రామ ప్రజలు నివాస పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, పౌష్టికమైన ఆహారాన్ని తీసుకొని, వైద్యశాలలో, వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేట్ వైద్యశాలల కంటే మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సుస్థిగా ఉంటే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటే ఉచితంగా వైద్య పరీక్షలు మందులు అందజేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, ఎంపీటీసీ గాండ్ల తిరుపతి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్, వైద్య బృందం తదితరులు ఉన్నారు.