.కరోనాకు చికిత్సకు ఆశ..
` కొవిడ్`19 వైరస్‌ను సమర్ధవంతంగా నిర్మూలిస్తున్న ఐవర్‌మెక్టిన్ డ్రగ్
` ఆస్ట్రేలియా పరిశోధకు వ్లెడి
మెల్‌బోర్న్,ఏప్రిల్ 4(జనంసాక్షి): కరోనా వైరస్‌ను సంహరించే ఔషధం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో పరిశోధను ఆరంభించారు. ట్రయల్స్ సైతం మొదయ్యాయి. ఏదేమైనప్పటికీ వాక్సిన్ విపణిలోకి రావాంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని నిపుణు చెబుతున్నారు. ఇదే తరుణంలో ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాయం చేసిన పరిశోధన అందరిలోనూ ఊరట కలిగిస్తోంది.పరాన్న జీవు (పారాసైట్స్) నుంచి సంక్రమించే వ్యాధు నయం చేసేందుకు ఉపయోగించే యాంటీ పారాసైటిక్ డ్రగ్ ‘ఐవర్‌మెక్టిన్’ నావెల్ కరోనా వైరస్‌ను పూర్తిగా నాశనం చేస్తోందని మోనాష్ వర్సిటీ పరిశోధకుడు కైలీ వాగ్‌స్టఫ్ తెలిపారు. పరిశోధన కోసం వేరు చేసిన కణాల్లో (సెల్ క్చర్) పెరుగుతున్న కరోనా సూక్ష్మక్రిమిని 48 గంటల్లో చంపేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ డ్రగ్‌తో క్లినికల్ ట్రయల్స్ జరిపితే కొవిడ్`19 చికిత్సకు ఉపయోగపడగదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. యాంటీవైరస్ రీసెర్చ్ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాల్ని ప్రచురించారు.’కేవం ఒక్క డోస్ 48 గంటల్లోనే వైరస్ ఆర్‌ఎన్‌ఏ అణువున్నిటినీ తొగించడాన్ని మేం గుర్తించాం. 24 గంటల్లోనే వైరస్ తగ్గుద కనిపించింది’ అని వాగ్‌స్టఫ్ అన్నారు. ఐవర్‌మెక్టిన్ ఆమోదిత యాంటీ పారాసైటిక్ డ్రగ్ అని ఆయన తెలిపారు. గాజుగొట్టం (విట్రో)లో హెచ్‌ఐవీ, డెంగీ, ఇన్‌ఫ్లుయెంజా, జికా వైరస్‌పైనా ఇది బాగా పనిచేసిందని వ్లెడిరచారు. పరిశోధన గాజు గొట్టంలోనే చేశాం కాబట్టి మానవుపై క్లినికల్ ట్రయల్స్ జరపాల్సిన అవసరం ఉందన్నారు.’ఐవర్‌మెక్టిన్ విస్తృతంగా ఉపయోగిస్తున్న సురక్షితమైన డ్రగ్. ప్రస్తుత డోస్‌ు మానవుపై ప్రభావవంతంగా పనిచేస్తాయో లేదో మేం గుర్తించాల్సి ఉంది. తర్వాతి అడుగు అదే. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారికి మందు లేనప్పుడు అందుబాటులో ఉన్నవాటిపై పరిశోధన చేస్తే ప్రజకు త్వరగా సాయం అందుతుంది’ అని ఆయన అన్నారు. కరోనా చికిత్సకు ఏ పద్ధతి (ఇంట్రావీనస్, ఓరల్)లో ఐవర్‌మెక్టిన్‌ను ఉపయోగించాలో ఇప్పటికీ స్పష్టత లేనప్పటికీ ఇతర వైరస్‌కు ఉపయోగించిన విధానంలో చేస్తే ఫలితం ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.’ఒక వైరాజిస్టుగా నేనీ బృందంలో భాగమయ్యా. చైనా ఆవ కరోనా వైరస్‌తో 2020, జనవరిలోనే ఐసోలేషన్‌కు వెళ్లా. కొవిడ్`19కు ఐవర్‌మెక్టిక్‌ను ఉపయోగించడం పట్ల ఉత్సాహంగా ఉన్నా’ అని పరిశోధనలో భాగమైన లియోన్ కెలీ (రాయల్ మెల్‌బోర్న్ ఆస్పత్రి, ఆస్ట్రేలియా) అన్నారు. భవిష్యత్తులో క్లినికల్ ట్రయల్స్ చేయడం అత్యంత ముఖ్యమని ఆమె పేర్కొంటున్నారు.