కరోనా కేసుల్లో 11శాతం తగ్గుదల
ఆందోళన కలిగిస్తున్న మరణాల సంఖ్య
కర్నాటకలో మెల్లగా పెరుగుతున్న కేసులు
న్యూఢల్లీి,అక్టోబర్29 (జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉన్నా థర్డ్‌వేవ్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతకు ముందురోజు 16 వేలకు చేరిన కేసులు.. తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి.
అయితే కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు.. క్రియాశీల కేసులు, రికవరీల విూద ప్రభావం చూపుతున్నాయి. తాజాగా రోజువారీ కేసుల కంటే రికవరీలే తక్కువగా ఉన్నాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..గరువారం 12,84,552 మందికి కొవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. 14,348 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే 11 శాతం మేర కేసుల్లో తగ్గుదల కనిపించింది. నిన్న 13,198 మంది కోలుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.42 కోట్లకు చేరగా.. అందులో 3.36 కోట్ల మందికి పైగా కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,61,334కి తగ్గి.. ఆ రేటు 0.47 శాతంగా ఉంది. గత ఏడాది మార్చి నుంచి ఇదే అత్యల్పం. నిన్న రికవరీ రేటు కాస్త తగ్గి..98.19 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వారపు సగటు పాజిటివిటీ రేటు 1.18 శాతానికి చేరింది. అలాగే రోజువారీ సగటు పాజిటివిటీ రేటు గత 25 రోజులుగా రెండు శాతం(1.12 శాతం)లోపే నమోదవుతోందని తెలిపింది. ఇటీవల కాలంలో కేరళ కరోనా మృతుల సంఖ్యను సవరిస్తోంది. గతంలో నమోదైన మరణాల్ని కొత్తగా చేరుస్తోంది. దాంతో కేంద్రం వెల్లడిరచే గణాంకాల్లో రోజువారీ మరణాలు భారీగా కనిపిస్తున్నాయి. తాజాగా ఆ సంఖ్య 805గా ఉంది. అందులో 708 కేరళ నుంచి వచ్చినవే. ఫలితంగా అక్కడ ఇప్పటివరకు 30 వేలకు పైగా మరణాలు సంభవించాయి. మరోపక్క నిన్న 74,33,392 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన
డోసుల సంఖ్య 104.82 కోట్లుగా ఉంది. ఇకపోతే రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరోసారి పెరిగాయి. గురువారం 478 మందికి పాజిటివ్ ని ర్దారణ కాగా బెంగళూరులో 235 మందికి, తుమకూరు 53, మైసూరు 47 మందికి పాజిటివ్ ప్రబలింది. 11 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 334 మంది కోలుకోగా 17 మంది మృతి చెందారు. ఇటీవల నెల రోజుల్లో మృతుల సంఖ్య పెరిగినట్లయ్యింది. బెంగళూరులో ఏడుగురు, దక్షిణ కన్నడలో నలుగురు, కోలార్, మైసూరులలో ఇరువురి చొప్పున, హాసన్, రామనగర్‌లలో ఒక్కొక్కరు మృతి చెందారు. 24 జిల్లాల్లో ఒక్కరూ మృతిచెందలేదు. 30 జిల్లాల్లో 8557 మంది చికిత్స పొందుతున్నారు.