కర్ణాటక సీఎం గా ఎంపికైన సిద్ధరామయ్య

 

బెంగళూరు, జనంసాక్షి: ఐదుగురు బరిలో ఉన్న కర్నాటక సీఎం పదవికి ఎంపిక ఎట్టకేలకు జరిగిపోయింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును ఖరారు చేయడంతో సీఎం ఎంపిక అంశానికి తెరపడింది. కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో సోమవారం ఉదయం 11.15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్యను ఎంపిక చేయడంలో కాంగ్రెస్‌ కుల సమీకరణాలను అమలు చేసిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సిద్ధరామయ్య స్వస్థలం సిద్ధ రామనహుండీ గ్రామం మైసూర్‌ జిల్లా. 1948, ఆగష్టు 12న జన్మించారు. 1978లో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మొదటి సారిగా భారతీయ లోక్‌దళ్‌ పార్టీ నుంచి 1983 లో ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం జనతా పార్టీలో చేరారు. రామకృష్ణ హేగ్డే మంత్రి వర్గంలో మంత్రిగా పని చేశారు. దేవేగౌడ నేతృత్వంలో జనతాదళ్‌ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2006 కాంగ్రెస్‌లో చేరారు.