కర్తార్‌పూర్‌ కారిడార్‌తో సత్సంబంధాలు


ఇది మంచి ప్రయత్నమన్న సిద్దూ
లా¬ర్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి):  కర్తార్‌పూర్‌ కారిడార్‌ తో రెండు ప్రాంతాల మధ్య శత్రుత్వం కనుమరుగవుతుందని పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ అభిప్రాయపడ్డారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా నవజ్యోత్‌ సిద్దూ అట్టారి-వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఈ సందర్భంగా నవజ్యోత్‌ సిద్దూను ఆలింగనం చేసుకుని ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం లా¬ర్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో నవజ్యోత్‌ సిద్దూ మాట్లాడుతూ..పాక్‌ ఆర్మీ చీఫ్‌ను సెకన్‌ పాటు ఆలింగనం చేసుకున్నా. ఇది రాఫెల్‌ డీల్‌ కాదు. ఇద్దరు పంజాబీలు కలిస్తే ఎలా ఆత్మీయతను పంచుకుంటామో అలాగే చేశా. పంజాబ్‌లో ఇది సాధారణ విషయమని అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య స్నేహ భావం పెరిగి..శాంతి నెలకొల్పేందుకు, సంపద పెంచుకునేందుకు, వాణిజ్య సంబంధాలను మెరుగు పరుచుకోవటానికి కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి ఆహ్వానం మేరకు నవజ్యోత్‌ సిద్దూ అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే.