కర్నాటకం తరవాత ఉత్తర భారతం

జాబితాలో మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌
ఇక్కడా పతనం తప్పదంటున్న నేతలు
భోపాల్‌,జూలై 24(జ‌నంసాక్షి):  పధ్నాలుగు నెలల కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత మరో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌పై కమలనాథులు దృష్టి సారించనున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇటీవల వరుసగా కాంగ్రెస్‌ నేతలు ఇదే విసయాన్ని ప్రస్తావిస్తున్నారు. కర్నాటక వ్వయహారంతో
ఇది సద్దు మణగదని, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లతో మగుస్తుందని అంటున్నారు. ఈ రెండు రాస్ట్రాల్లో కూడా బొటాబొటి మెజార్టీతో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టింది. దీనికితోడు కమలనాథ్‌, అశోక్‌ గెహ్లాట్‌ పాలనపై సొంత కాంగ్రెస్‌లోనే వ్యతిరేకత ఉంది. ఇక్కడ ఇద్దరు వృద్ద నేతలను అధికారంలోకి తసీఉకుని రావడంపై కాంగ్రెస్‌ యఉవనేతలు అగ్రహంగా ఉన్నారు. రాహుల్‌ అస్త్ర సన్యాసం కూడా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీకి భరోసా లేకుండా పోయింది. రాహుల్‌ వైదొలగినా మరో సమర్థ నేతను పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోలేని దౌర్భాగ్యంలో ఆ పార్టీ ఉంది. అందుకే కర్నాటక తరవాత ఇప్పుడు మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌లలో ప్రభుత్వాలు కూలడానికి సిద్దంగా ఉన్‌ఆనయన్న ప్రచారం ఊపందుకుంది. ప్రజల్లో కూడా ఇదే విసయంపై చర్చ సాగుతోంది.  దీనికి మధ్యప్రదేశ్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత జీతూ పట్వారీ కూడా అవుననే చెబుతున్నారు. విశ్వాసపరీక్షలో కర్ణాటక ప్రభుత్వం కుప్పకూలిన అనంతరం పట్వారీ విూడియాతో మాట్లాడుతూ, కర్ణాటక లాగానే ఇక్కడ కూడా తమ సర్కార్‌కు ఎన్నివిధాల చిక్కులు కల్పించాలో అన్ని రకాలుగా బీజేపీ చిక్కులు కల్పిస్తూనే ఉంటుందని, అయితే ఇక్కడున్నది కమల్‌నాథ్‌ ప్రభుత్వమని, కుమారస్వామి ప్రభుత్వం కాదని ఆయన అన్నారు. అయితే పైకి మేకపోతు గాంభీర్యం కనిపిస్తున్నా కమలనాథ్‌ కూడా మలూల్యం చెల్‌ఇంచుకోక తప్పదన్న సంకేతాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాగా, మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఆరోపణలను బీజేపీ సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తోసిపుచ్చారు. ‘ఇక్కడి ప్రభుత్వం కూలిపోతే అందుకు మేము ఎంతమాత్రం కారణం కాబోము. ప్రభుత్వాలు పడిపోతే అది కాంగ్రెస్‌ స్వయంకృతమే అవుతుంది. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలున్నాయి. ఎస్‌.పి, బీఎస్‌పీ మద్దతుతో ప్రభుత్వం నడుస్తోంది. అంతర్గత విభేదాలు ముదిరి ఏదైనా జరిగితే అందుకు మా బాధ్యత ఏవిూ ఉండదు’ అని చౌహాన్‌ అన్నారు. ఆయన అనడం ఎలా ఉన్నా అక్కడ ఎస్పీ,బిఎస్పీలు ఇప్పటికే కమలనాథ్‌ను బెదరిస్తున్నారు. రాజస్థాన్‌లోనూ గెహ్లాట్‌ తీరుపై స్వయంగా రాహుల్‌ అసంతృప్తిగా ఉన్నారు. ప్రజలు కూడా వీరి పాలనపట్ల సంతృప్తిగా లేరు. మొత్తంగా ఈ రెండు రాష్ట్రాలకు కూడా ఎప్పుడో ముహూర్తం పడడం ఖయాంగా కనిపిస్తోంది.