కర్నాటక ఐటి దాడుల్తలో కోట్లాది నగదు స్వాధీనం

శివమొగ్గలో అత్యధికంగా నగదు పట్టివేత
బెంగళూరు,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): ఐటి అధికారులు వేర్వేరు ప్రాంతాలలో  నిర్వహించిన దాడులలో కోట్లాదిరూ పాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. శివమొగ్గ జిల్లా భద్రావతిలో కార్‌ స్టెప్నీలో రూ.2.30 కోట్లుతో పాటు మొత్తం రూ.4.5కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కార్‌స్టెప్నీలో 2వేల రూపాయల ముఖ విలువ కల్గిన నోట్ల బండిల్స్‌ను గుర్తించా మ న్నారు. మరొకచోట దాడుల లో గోవాకు చెందిన నగల వ్యాపారస్తులు ఇద్దరు అన్నదమ్ములకు చెందిన 30 లక్షల నగదు తెలుస్తోంది.విజయ పుర పట్టణం వివేకానందనగర్‌ లో బ్యాంకు ఉ ద్యోగి అరిఫ్‌ కర్నేకర్‌ నివాసంలో కోటి రూపాయలు గుర్తించారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి శివానందపాటిల్‌కు సన్నిహితుడని తెలుస్తోంది. బళ్లారి లో ఆదాయ పన్నుశాఖ అధికారులు ఆదివారం ముప్పేట దాడులు చేశారు. ఎన్నికల వేళ ఈ దాడులు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర
ఉపా ధ్య క్షుడు నారా సూర్యనారాయణరెడ్డి ఇల్లు, కార్యాలయంలో, బళ్లారి రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర ఇల్లు, కార్యాలయంపై ఐటీ దాడులు చేసింది. ఉదయం 7.30గంటల సమయంలో ఐటీ శాఖ అధికారుల బృందం గాంధీనగర్‌లోని నారా సూర్యనారా యణరెడ్డి కార్యాలయంపై దాడులు నిర్వహిం చారు. ఈ సమయంలో ఆయన కార్యాలయం లోనే ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యే నాగేంద్ర ఇంటిపై దాడులు జరిగాయి. వీరశేఖర్‌ మరో వ్యక్తి ఇంటిపై కూడా ఐటీ దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా వుంటే ఎంపీ ఉగ్రప్ప ఇది బిజేపీ కుట్రనే అని అన్నారు. కాంగ్రెస్‌ నాయ కుల ఇళ్లపై దాడులు చేయడం హేమయమైన చర్యని మండిపడ్డారు.