కర్నాటక పంచాయితీలో కొనసాగుతున్న కౌంటింగ్‌

వరదల కారణంగా కొడగులో ఎన్నికల వాయిదా

బెంగళూరు,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): కర్నాటకలోని గతవారం 102 పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. రాత్రి సమయానికి పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొడెగు జిల్లాలోని 3 స్థానాల ఎన్నికలు వరదల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కౌంటింగ్‌ పక్రియ దాదాపు సగం పూర్తవగా, ఫలితాలలో కాంగ్రెస్‌, బిజెపిల మధ్య పోరు సాగుతోందని అధికారులు వెల్లడించారు. జెడియు,కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఈ ఎన్నికలలో ముందస్తుగా పొత్తులను ఏర్పరుచుకోలేదు కాని ఫలితాల అనంతరం పొత్తులు ఏర్పరుచుకోవచ్చని భావిస్తున్నారు. కేంద్ర పాలక పార్టీ అయిన బిజెపి అన్ని స్థానాల్లోనూ పోటీ చేసింది. కాగా మూడు పార్టీలు ఈ ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ముందుకు తీసుకెళ్తాయిన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఆగస్ట్‌ 29న 100 పట్టణ, నగర మున్సిపాలిటీలలో, పంచాయితీలలో ఎలన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే వార్డుల రిజర్వేషన్‌లకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో మైసూర్‌, శివమొగ్గ, టుమకూరు జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించలేదు.