కలుషితమైన నీరును తాగి అ స్వస్థతకు గురైన బాధితులను ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమర్శించిన డీకే సిగ్న రెడ్డి

జోగులాంబ గద్వాల ప్రతినిధి. జనం సాక్షి(జూలై 8)
గద్వాల ప్రాంతంలో కలుషిత నీరు తాగి ముగ్గురు
ప్రాణాలను బలి తీసుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వo.
 ప్రభుత్వ ఆసుపత్రిలో చాలామంది చిన్నారులు ,53 మంది అస్వస్థకు గురై ఆస్పత్రిలో సతమతమవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ కిషోర్ కుమార్ గారికి మెరుగైన చికిత్స అందజేయాలని ఆదేశించారు. వీలైతే  ప్రైవేట్ ఆస్పత్రిలో  చేర్పించి కాపాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి చికిత్స నిమిత్తం ఖర్చులను ప్రభుత్వం భరించాలని కోరారు. అదేవిధంగా చనిపోయిన ముగ్గురు కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల తో ఎక్స్ గ్రేషీయ ఒక్కొక్కరికి కోటి రూపాయలు అందజేయాలని దీనికి సంబంధించిన ఆరోగ్యశాఖ మరియు మున్సిపల్ శాఖ కు సంబంధించి కేటీఆర్ మరియు హరీష్ రావు గారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిన్న
పట్టణ మున్సిపల్  కార్యాలయం ముందు బీజేపీ పార్టీ తరపున  ధర్నా చేయడం జరిగింది.గత 3,4 రోజుల నుంచి గద్వాల్ పట్టణం లో కలకలం రేపుతున్న కలుషిత నీటి పై  గంటవీది, దరూర్ మెట్టు,మొమిన్ మహెల్ల వేదనగర్ ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్య బారిన పడి  చనిపోతున్న కూడా అధికార పార్టీ MLA, మున్సిపల్ చైర్మన్ స్పందించకపోవడం దారుణం అని  ఈ సంఘటన పూర్తి బాధ్యత వహించి రాజీనామా చేయాలని కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని ధర్నా చేయడం జరిగింది.ఎన్నికలొచ్చినప్పుడు ప్రజల ఓట్లు కావాలి తప్పా ప్రజల సమస్యలు అవసరం లేదని  ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో  జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి పట్టణ కార్యదర్శి డీకే సిగ్న రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణ రెడ్డి, రాష్ట్ర మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు పట్టణ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు