కల్తీ కల్లు తాగి ఒకరి మృతి

ఆదిలాబాద్‌: జిల్లాలోని ఉట్నూరు మండలం రాజన్న గూడలో కల్తీ కల్లు తాగి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.