కళాజాతతో అవగాహన సదస్సులు.
జనం సాక్షి ఉట్నూర్.
తెలంగాణ సాంస్కృతిక సారధి కళాజాత జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మరియు ఐటిడిఏ పిఓ వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల పై స్థానిక తెలుగు హిందీ బంజారా భాషల్లో గ్రామాలకు అవగాహన సదస్సు నిర్వహించి ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుందని టీం లీడర్ ఆత్రం గోవింద్ రావు తెలిపారు.టీం లీడర్ మాట్లాడుతూ శుక్రవారం నాడు మండల కేంద్రంలోని నాగల్ కొండ ఇలియాస్ నాగర్ గ్రామాల్లో నిర్వహించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కళజాత టీం సభ్యులు గుంజల రమేష్ మోహన్ నాయక్ సీహెచ్ రవి రాథోడ్ శంకర్ వెంకట్ రావు రాజలింగు ఆశిష్ పుర్షోతం నాగేష్ నర్సమ్మ గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.