`కాంగ్రెస్‌లోకి వివేక్.. బీజేపీకి భారీ రaలక్
` ‘కమలం’ పార్టీకి టాటా చెప్పిన వివేక్ వెంకటస్వామి
` ముందే వెల్లడిరచిన ‘జనంసాక్షి’
` రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం
హైదరాబాద్, నవంబర్ 1 (జనంసాక్షి):ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీకి మరో భారీ షాక్ తగిలింది. పెద్దపల్లి మాజీ ఎంపీ, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి కమలం పార్టీకి గుడ్‌బై చెప్పారు. ‘జనంసాక్షి’ ఈ విషయాన్ని బుధవారం ప్రచురించగా.. అదేరోజు కేవలం రెండు వాక్యాలతో ఆయన తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. ఉదయం 11 గంటల 20 నిమిషాలకు వివేక్ రాజీనామా లేఖ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరింది. మధ్యాహ్నం 12 గంటలకు నోవాటెల్ హోటల్ వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసి వివేక్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం రాజకీయ చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశాలను బిఆర్‌ఎస్ నెరవేర్చలేకపోయిందని చెప్పారు. కెసిఆర్ కుటుంబం వారి కుటుంబ ఆకాంక్షల మేరకే పనిచేస్తోందని విమర్శించారు. టికెట్ అనేది అంత ముఖ్యమైన విషయం కాదని, కాంగ్రెస్ నిర్ణయం మేరకు పనిచేస్తానని చెప్పారు. బిఆర్‌ఎస్‌ను గద్దె దింపే శక్తి కాంగ్రెస్‌కు ఉందని, ఆ నమ్మకంతోనే కాంగ్రెస్‌లో చేరానని, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. వివేక్ చేరికతో కాంగ్రెస్‌కు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి గాంధీ కుటుంబం ఎంత అవసరమో, తెలంగాణకు వెంకటస్వామి కుటుంబం అంతే అవసరమని అన్నారు. గాంధీ కుటుంబం, వెంకటస్వామి కుటుంబం మధ్య ఎప్పటి నుంచో అనుబంధం ఉందని గుర్తు చేశారు. అయితే వివేక్‌తో పాటు కుమారుడు వంశీ కూడా రాహుల్‌తో సమావేశమయ్యారు. తన కుమారుడి కోసమే వివేక్ బీజేపీకి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వివేక్ కుమారుడు వంశీకి కాంగ్రెస్ పార్టీ చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఆశించినట్లుగా తెలిసింది.