కాంగ్రెస్ పార్టీకి రాజీనామా : పంజాబ్ క్యాబినెట్ మంత్రి రజియా సుల్తానా
చంఢీఘడ్: పంజాబ్ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా, పంజాబ్ క్యాబినెట్ మంత్రి రజియా సుల్తానా సిద్ధూబాటలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సదరు మంత్రి మాలేర్ కోట్లా నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, నవజ్యోతి సింగ్ విలువలు ఉన్న నాయకుడని ఆమె కొనియాడారు. పంజాబ్ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నేతగా సిద్ధూను రజియా సుల్తానా అభివర్ణించారు.. ఆయన బాటలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక సామాన్య కార్యకర్తగా పార్టీకి సేవలందిస్తానని తెలిపారు..రజాయా సుల్తానాతో పాటు… పంజాబ్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ యోగిందర్ ధింగ్రా.. అదే విధంగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ క్యాషియర్ గుల్జార్ ఇండర్ ఛహల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వరుస రాజీనామాలతో పంజాబ్‌లో కాంగ్రెస్ తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. కాగా, గతంలో కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్‌ల మధ్య పలు అంశాలలో బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి చాలా సార్లు ప్రయత్నించింది.