కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పై.. అక్రమకేసు…… ధర్నాకాంగ్రెస్ పార్టీ అగ్రనేత పై.

. అక్రమకేసు…… ధర్నా-జంగా రాఘవరెడ్డి..
-అక్రమకేసులు ఎత్తివేయాలి – ఉపసర్పంచ్ సద్దాంఉస్సన్
హన్మకొండ బ్యూరో 24 మర్చి జనంసాక్షి
అధికారంలో ఉన్న BJP కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారిపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించడంతో కాజీపేట పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టడం జరిగింది…- ఈ సంద‌ర్భంగా జంగా రాఘ‌వ‌రెడ్డి మాట్లాడుతూ.. ప్ర‌పంచంలో గొప్ప ప్ర‌జాస్వామిక దేశంగా వ‌ర్ధిల్లుతున్న భార‌త‌దేశంలో బీజేపీ ప్ర‌జ‌ల మ‌ధ్య కులాలు, మ‌తాల పేరుతో చిచ్చు పెడుతోంద‌ని, మైనార్టీ వ‌ర్గాల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తోంద‌ని మండిప‌డ్డారు. ఇష్టారాజ్యంగా పెట్రోలు, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌లు పెంచింద‌ని అన్నారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హ‌క్కుల‌ను కాల‌రాస్తోంద‌ని,రైతు స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌ని  బీజేపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండగ‌డుతున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాహుల్‌ గాంధీ గారిపై అనేక త‌ప్పుడు కేసుల‌తో క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లకు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు. ఎలాంటి కేసుల‌కైనా కాంగ్రెస్ పార్టీ బెద‌ర‌ద‌ని, రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో దేశంలో మ‌ళ్లీ ప్ర‌జాస్వామ్యం వ‌ర్ధిల్లుతుంద‌ని అన్నారు. వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌ని, ప్ర‌జ‌లు ధైర్యంగా ఉండాల‌ని సూచించారు. – రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా కాజీపేట‌లో కోచ్ ఫ్యాక్ట‌రీ ఇవ్వ‌కుండా, బ‌య్యారంలో ఉక్కు ఫ్యాక్ట‌రీ, ములుగులో గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయ‌కుండా వ‌రంగ‌ల్‌కు బీజేపీ తీర‌ని అన్యాయం చేస్తోంద‌ని జంగా రాఘ‌వ‌రెడ్డి ఆరోపించారు. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను అమ‌లు చేయ‌కుండా బీజేపీ మోసం చేస్తుందాని విమర్శించారు.కావున వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికలలో కేంద్రం లో బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో BRS ప్రభుత్వానికి తగినబుద్ది చెప్పాలని కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాల‌ని రాఘ‌వ‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా మాజీ టౌన్ పార్టీ అధ్యక్షులు కట్ల శ్రీనివాస్ గారు స్థానిక కార్పొరేటర్ జక్కుల రమా రవీందర్ యాదవ్ 63వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ చంద్రయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రపు కోటేశ్వర్ బోయిని కుమార్ యాదవ్  హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రేపల్లె రంగనాథ్ గారు హనుమకొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గణేష్ గారు కాంటెస్ట్ కార్పోరేటర్ సంధ్యల విజయ్ కాంటెస్ట్ కార్పోరేటర్ మండల సమ్మయ్య వస్కుల శంకర్ బైరి వరలక్ష్మి లింగమూర్తి డివిజన్ ప్రెసిడెంట్ ఎండి మహమూద్ 63వ డివిజన్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి మహిళా నాయకురాలు అనిత రెడ్డి  మధ్యల శోభ మహిళ నాయకురాలు  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ ప్రెసిడెంట్ పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .