కాంగ్రెస్ పార్టీ  ఆఫీసులో డిసిసి అధ్యక్షులు ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ

పెగడపల్లి సెప్టెంబర్ 13 ( జనం సాక్షి ) పెగడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ  ఆఫీసులో డిసిసి అధ్యక్షులు ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర విమోచన దినాన్ని కాంగ్రెస్ మండల కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పుతూ అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే విమోచన దినాన్ని రెండు రోజులు పండగ వాతావరణం గా చేసుకోవాలని వారు చేస్తున్న విధానం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం 1948లో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరియు హోంశాఖ మంత్రివర్యులు లాల్ బహుదూర్ శాస్త్రి కృషి చేయడం వలన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనం చేయబడింది కానీ నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆనాడు ఆ పార్టీ కూడా లేనేలేదని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కూడా లేదని దీనికి కృషిచేసిన కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే విధంగా వారు పన్నుతున్న కుయుక్తులను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా  పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి  మరియు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ  చేస్తున్నటువంటి జోడోయాత్ర కు సంఘీభావంగా రేపు చేయబోవు పాదయాత్ర ను తెలంగాణ విమోచన దిన సంబరాల తర్వాత తిరిగి పాదయాత్ర ఉంటుందని పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ రేపు చేయబోయే యాత్రను మరోసారి చేసే ముందు తేదీ ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కావున పార్టీ కార్యకర్తలు అందరూ గమనించగలరని మనవి ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఒరుగుల శ్రీనివాస్�