కాంగ్రెస్‌ పాలనలో నరకం చూశాం

` పథకాల పేరుతో కర్నాటకలో మోసం
` తెలంగాణలో కూడా మోసం చేయాలని కుట్రలు : మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్‌,సిద్దిపేట(జనంసాక్షి): ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని మంత్రి హరీశ్‌రావు  విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ పాలనలో కర్ణాటక  ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. పాత పథకాలకు కాంగ్రెస్‌  ప్రభుత్వం పాతర వేస్తున్నదని, పిల్లలకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ల్లో కూడా కోత పెట్టిందని విమర్శించారు. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్‌ నాయకురాలు కత్తి కార్తికతోపాటు పలువురు నేతలు మంత్రి హరీశ్‌ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. ఢల్లీి నాయకులను నమ్మితే మోసపోతామని చెప్పారు. కర్ణాటకలో హావిూ ఇచ్చిన రాహుల్‌ గాంధీ  ఆచూకీ లేదని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఆ రాష్ట్రానికి వెళ్లలేదని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో కర్ణాటక దివాళా తీసిందని ఆరోపించారు. వెలుగుల దీపావళి కావాలా? దివాళా తీసిన కర్ణాటక కావాలా? అనే ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని చెప్పారు. కర్ణాటకలో ఏం జరుగుతుందో తెలంగాణ రైతులు గమనించాలన్నారు. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై ఇప్పటికే యుద్ధం చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే అంటున్నారని విమర్శించారు. కర్ణాటలో తీవ్రమైన కరంటు కోతలు విధిస్తున్నారని దీంతో ఆరు నెలల్లోనే 357 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. నేను రైతుని అని గర్వంగా చెప్పుకునే స్థితికి సీఎం కేసీఆర్‌ తెలంగాణను తీసుకొచ్చారన్నారు. కర్ణాటక పరిస్థితి మనకెందుకన్నారు. కాంగ్రెస్‌ నేతలు గెలిచేవరకు ఒక్క ఛాన్స్‌ అంటారని, ఆ తర్వాత ఎక్స్‌క్యూజ్‌విూ అంటారని విమర్శించారు. వన్‌ ఛాన్స్‌ కాంగ్రెస్‌ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కర్ణాటకలో ఆరు నెలల్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ రాలేదన్నారు. రాహుల్‌ గాంధీ.. రాంగ్‌ గాంధీగా మారిపోయారని విమర్శించారు. కర్ణాటకలో ఫెయిల్యూర్‌ మోడల్‌ను మెడలో వేసుకుని తెలంగాణకు వస్తున్నారని చెప్పారు. కర్ణాటకలో రైతు బంధు ఇవ్వడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పారు. 6 నెలల క్రితం చేసిన చిన్న తప్పుకు కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే గుండెపోటు గ్యారెంటీ అన్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రజలు మోసపోరన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని చిన్నదిచేసేలా చిదంబరం మాట్లాడారని విమర్శించారు. హిరోషిమా, నాగాసాకి విూద అణుబాంబులు వేసిన అమెరికా సారీ చెప్పినట్లుగా ఆయన తీరుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మందిని కాల్చిచంపిన డయ్యర్‌ సారీ చెప్పినట్లు ఉందన్నారు. ఆత్మబలిదానాలు చేసిన బిడ్డల తల్లిదండ్రులు కొరడాతో కొట్టినా కాంగ్రెస్‌ పార్టీ పాపం పోదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కష్టాలు తీర్చిన నాయకుడిని మర్చిపోవద్దు
:మర్కుక్‌ దశ, దిశ మార్చింది కేసీఆర్‌ నీళ్ల కష్టాలు తీర్చాడు. రోడ్లు లేక నాడు ఎంతో ఇబ్బందులు. నేడు డబుల్‌ రోడ్లు కనిపిస్తున్నాయి. గతుకుల గజ్వేల్‌(ఉజీతీలివశ్రీ)ను బతుకుల గజ్వేల్‌ చేసిండని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు గజ్వేల్‌ నియోజకవర్గం, మర్కుక్‌లో కేసీఆర్‌ గెలుపును కాంక్షిస్తూ మంత్రి హరీశ్‌ రావు రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెత్తివిూద గంగమ్మ లెక్క కొండపోచమ్మ సాగర్‌ తెచ్చింది కేసీఆర్‌. ఎన్నికల సమయంలో ఎవడో వచ్చి బిడ్డా బిడ్డా అంటే నమ్మి మోసపోవద్దు. ఇంకొకడు వస్తే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఉండదు, అభివృద్ధి ఉండదని స్పష్టం చేశారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు పోదాం పద సర్కారు దవాఖాన అంటున్నారు. ఈసారి బీఆర్‌ఎస్‌ గెలవగానే సన్నబియ్యం, పాత బియ్యం ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అసైన్డ్‌ ల్యాండ్స్‌కి పట్టా ఇచ్చి హక్కులు ఇవ్వబోతున్నం. సిలిండర్‌ ధరలు పెంచిన బిజెపి వాళ్లని ప్రశ్నించాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు.   బూతులు మాట్లాడే వారికి పోలింగ్‌ బుతుల్లోనే బుద్ధి చెప్పాలని సూచించారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ను మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ వస్తే మూడు గంటల కరెంట్‌ వస్తది. 10 ఊఖ మోటార్‌ ఎవరు కొనివ్వాలి. రేవంత్‌ రెడ్డికి వ్యవసాయం అంటే తెల్వదని విమర్శించారు. 30 తేదీన అందరం కారుకు గుద్దాలి. బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. మంత్రి హరీశ్‌ రావు సమక్షంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.