కాంట్రాక్టు కార్మికుని కుటుంబానికి ద్రోహం చేసిన కార్మిక సంఘాలు.

బెల్లంపల్లి, ఆగస్టు 6, (జనంసాక్షి)
బెల్లంపల్లి శాంతిఖని గని అండర్ గ్రౌండ్ గని 4/4/2022 తేదీ నందు మరణించిన కందుల లక్ష్మీనారాయణ కుటుంబానికి కార్మిక సంఘాలు ద్రోహం చేశాయని కార్మిక సంఘాల జెఏసి ఆరోపించింది. మృతి చెందిన కార్మిక కుటుంబానికి రూ. అయిదు లక్షలు ఇప్పిస్తామని చెప్పిన గని ఏజెంటు, అధికార పార్టీ ముఖ్య నాయకులు సింగరేణి ఆసుపత్రి ప్రాంగణంలో కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. కానీ ఇందులో కార్మికుని గ్రాట్యుటీ రూ. నలబై అయిదు వేలు, నెల జీతం ఎనిమిది వేలు కలిపి ఐదు లక్షలు కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు గని మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ రాజు, మరియు దాసరి శ్రీనివాస్, తిరుపతి గౌడ్ సంతకాలు చేశారని వివరించారు. వాస్తవానికి లెక్కలలో తప్పుడురాతలు రాసిన కాంట్రాక్టర్ మరోసారి మృతుడు కందుల లక్ష్మీనారాయణ కుటుంబానికి మోసం చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం ఇచ్చినట్టుగా రాసిఉన్న కాగితాన్ని కుటుంబసభ్యుల వద్దకు సంతకాలకోసం కాంట్రాక్టర్ కుటుంబసభ్యులతో సంతకాలు చేయించాడని, అప్పుడు ఆకాగితంలో గ్రాట్యుటీ, జీతానికి సంబంధించిన లెక్కలు లేవని తెలిపారు. గని మేమేజర్, ఏజంట్, అసిస్టెంట్ మేనేజర్ రాజు సంతకాలుచేసారు. ఈ విషయమై జేఏసీ నాయకులు శనివారం శాంతి ఖని కాలరీ మేనేజర్ ను, ఏజెంట్ వెంకటేశ్వర్లను, వెల్ఫేర్ ఆఫీసర్ ను సంప్రదించగా జరిగిన వాస్తవాన్ని వారు ఒప్పుకున్నారని తెలిపారు. వాస్తవంగా గుర్తింపు సంఘం, జాతీయ కార్మిక సంఘాలు అని చెప్పుకునే శాంతిఖనిలో ఉన్న నాయకులు వీరికి చిత్తశుద్ధి ఉంటే మృతుడు కందుల లక్ష్మీనారాయణ కుటుంబానికి రావలసిన నెల జీతం ఎనిమిది వేలు, గ్రాట్యుటీ నలబై అయిదు వేలు ఇప్పించల్సిందిగా వారు డిమాండ్ చేశారు. గతంలో ఈ నాయకులే కందుల. లక్ష్మీనారాయణ కుటుంబానికి కార్మికులు, అధికారులు
విరాళంగా ఇచ్చే రూపాయల హామీ ఇచ్చి ఇప్పుడు ఆపిన ఘనత ఈ నాయకులదే ఇప్పటికైనా వారు వారి పద్ధతులు మార్చుకొని కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
సింగరేణి యాజమాన్యం తమ తప్పులను కప్పి పుచ్చుకోడానికి, తమనుతాము కాపాడుకోవటానికి ఒక సాధారణ కాంట్రాక్ట్ కార్మికుని కుటుంబానికి ద్రోహం చేయటం మానుకోవాలని తెలిపారు. ఈసమావేశంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పార్వతి రాజి రెడ్డి, ఎండి చాంద్ పాషా
అంబాల మహేందర్, మనిరాం సింగ్, నీరటి రాజన్న పాల్గొన్నారు.