కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి మంచి రోజులు
ఆదిలాబాద్,జూన్20(జనంసాక్షి): సిర్పూర్ పేపర్ మిల్లు మూపతడడం, ఆస్తిపన్ను సక్రమంగా వసూలు కాకపోవడంతో కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి నిధుల కొరత ఏర్పడిరది. తాజాగా మళ్లీ పునరుద్దరణకు
అవకాశం ఏర్పడడంతో మళ్లీ సనిధులు రానున్నాయి. మూడేళ్లుగా ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల చేసిన గ్రాంట్లు మినహా, జనరల్‌ఫండ్ కింద ప్రత్యేకంగా నిధులు సమకూరకపోవడంతో ప్రతి పాలకవర్గ సమావేశంలోనూ సమస్యలపై అధికారులను నిలదీస్తూనే ఉన్నారు. దీంతో నిధులు లేక అభివృద్దిలో నీరసిందింది. ఒప్పంద కార్మికులకు ఆరు నెలలు, ఎన్‌ఎంఆర్ కార్మికులకు ఏడు నెలల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. విద్యుత్తు బిల్లులకు చెల్లించడంతో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ కోసం కొన్ని నెలలుగా వాహనం అద్దె ప్రతి నెల రూ.24 వేలు చెల్లిస్తున్నట్టు సమాచారం. అనంతరం వారి వేతనాల నుంచి వాహనాల అద్దె పేరిట తీసుకున్న డబ్బులను రికవరీకి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాహనం అద్దె ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నామని ప్రకటించారు.