కాగ్నిజెంట్ ఉద్యోగుల బోనన్‌లో కోత
చెన్నై: 2012 సంవత్సరానికిగాను కాగ్నిజెంట్ ఉద్యోగులకు బోనన్‌లు తగ్గనున్నాయి. దీనికి కారణం 2012 సంవత్సరంలో సంస్థ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోవడమే. గత సంవత్సరంతో పోల్చుకుంటే 2012 లో బోనస్‌లు 90- 145 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ సంస్థలో సగటు బోనన్ 165 శాతం వరకు ఉండేది. గత కోద్ది సంవత్సరాలుగా లక్ష్యాలను తేలిగ్గా అధిగమిస్తూ వచ్చిన కాగ్నిజెంట్ ఈ ఒక్క సంవత్సరమే వెనకబడిపోయింది. 2012లో కంపెనీ అభివృద్ధి రేటు 23 శాతం లక్ష్యం కాగా 20 శాతం మాత్రమే నమోదైనట్లు కాగ్నిజెంట్ అధికారులు పేర్కొన్నారు.