కాబూల్‌లో పేలిన కారుబాంబు 

– 10మంది దుర్మరణం
కాబూల్‌, నవంబర్‌29(జ‌నంసాక్షి) : ఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి విధ్వసం సృష్టించారు. కాబూల్‌లోని బ్రిటీష్‌ రక్షణ సంస్థకు చెందిన జీ4ఎస్‌ శిబిరం సవిూపంలో కారు బాంబు పేలిన ఘనటలో 10 మందికి పైగా దుర్మరణం చెందగా, మరో 20మంది గాయపడ్డారు. దాడి ఘటనపై గురువారం అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి నజీబ్‌ దానీశ్‌ విూడియాతో మాట్లాడారు. బాంబు దాడి జరిగిన వెంటనే తుపాకీ కాల్పుల మోత వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. కారు బాంబు దాడి జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని కాబూల్‌ పోలీసు అధికారి బసీర్‌ ముజాహిద్‌ తెలిపారు. దాడికి పాల్పడ్డింది తామేనని ఏ ఉగ్రసంస్థ ప్రకటన చేయలేదని, అయితే తాలిబన్‌ ఉగ్రవాదులు ఈ విధ్వంసానికి కారణమై ఉండొచ్చునని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.  కాగా, ఐక్యరాజ్యసమితి జెనీవాలో నిర్వహించిన సమావేశంలో అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని తాలిబన్లతో శాంతి ఒప్పందాన్ని చేసుకుంటానని చెప్పిన నేపథ్యంలోనే బుధవారం బాంబుదాడి జరగడం గమనార్హం. గత 24 గంటల నుంచి హెల్మాండ్‌ సరిహద్దు ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 30 మంది పౌరులు,
16 మంది తాలిబన్‌ సాయుధులు చనిపోయారని అధికారులు వెల్లడించారు.