కామునిపెంటలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం
కామునిపెంటలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవంవరంగల్ ఈస్ట్, మార్చి 30 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని కరీమాబాద్ కాముని పెంటలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా స్థానిక శివాంజనేయ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో గురువారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఎంతో గొప్పగా ఈ ప్రాంత వాసులు సీతారాముల కల్యాణోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అర్చకులు వరయోగుల శ్రీనాథ్ కృష్ణులు సీతారాముల కల్యాణాన్ని జరిపించారు అనంతరం వందలాదిమంది భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిన్నా మల్లేశం , షేర్ల కుమారస్వామి, మల్లూరి బాబురావు, పెన్నా రమేష్, కోరబోయిన చక్రపాణి, కోరబోయిన రాంప్రసాద్, షేర్ల కిషోర్, తోట రాజు, ఈగ రాము, షేర్ల శ్రీధర్, బండి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.