కార్గిల్ దివాస్ వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యే జోగురామన్న.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :
దేశం కోసం శత్రు దేశాలతో విరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన వీర జవాన్ల త్యాగాలు మరువలేనివని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శత్రు దేశం పాకిస్తాన్ పై విజయం సాధించిన కార్గిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే కార్గిల్ దివస్ సందర్భంగా ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గల కార్గిల్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో కలిసి ఎమ్మెల్యే పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పౌరుడు దేశ రక్షణకై ఓ సైనికుల్లా నిలబడాలని పిలుపునిచ్చారు . కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన అమర జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలని అన్నారు. జవాన్ల స్ఫూర్తి నేటి యువతరానికి ఆదర్శప్రాయం అని వారి బాటలోనే దేశ సేవకై ముందు టు దేశ రక్షణలో పాలుపంచుకోవాలి అన్నారు.. వీరు త్యాగాలను స్మరిస్తూ ప్రతియేటా వారిని గౌరవించుకోవడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్, ఎన్.సి.సి అదికారులు, మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.