కార్డెన్‌సెర్చ్‌లో రౌడీషీటర్ల అరెస్ట్
హైదరాబాద్,ఏప్రిల్20(జనంసాక్షి): సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పకడ్బందీగా జరిగిన ఈ తనిఖీలు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ నగర్
ప్రాంతంలో జరిగాయి. మాదాపూర్ డిసిపి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ఇరవై బృందాలుగా విడిపోయి నిర్బంధ తనిఖీలు కొనసాగించారు. పలువురు అనుమానితులను పట్టుకుని ప్రశ్నించారు. వాహనాలకు సంబంధించి ధ్రువ పత్రాలను పరిశీలించారు. సరైన ధ్రువ పత్రాలు లేని 67 వాహనాలు, స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 12 మంది అనుమానితులతో ముగ్గురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు.
అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు నిర్బంధ తనిఖీలు ఉపయోగపడతాయని దక్షిణ మండల డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు. పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుత్నున్నట్టు ఆయన పేర్కొన్నారు.