కార్పోరేషన్‌తో అడుగు ముందుకు
వరంగల్,మార్చి26 (జనంసాక్షి) : పెరుగుతున్న జనాభ, ట్రాఫిక్‌కు అనుగుణంగా రోడ్ల మరమత్తు, అభివృద్ధి పర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని, అందులో భాగంగానే జాతీయ, అంతర్జాతీయ రోడ్లను మరమత్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రక్రియ మొదలు పెట్టిందని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. వరంగల్ కార్పోఎరేషన్‌గా మారడంతో పట్టణాన్ని సుందరీకరించేందుకు కృషిచేస్తామని అన్నారు. కార్పోరేషన్‌గా మారడంతో మరింతగా అభివృద్ది చెందే అవకాశాలు వచ్చాయని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని రోడ్లను మరమత్తు, అభివృద్ధి పరుచుటలో భాగంగా యుద్దప్రాతిపదికన చర్యలు పేట్టనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాదిలోపు రోడ్ల మరమత్తుగాను టెండర్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందన్నారు. రోడ్ల మరామత్తు, విస్తీర్ణ, డివైండ్‌లకుగాను 1786 కోట్ల 92 లక్షల రూపాయాలు మంజూరు చేసిందన్నరు. జిల్లాలో1716 కిలో విూటర్ల రోడ్ల అభివృద్ధికి 235 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసిందన్నారు. నల్లగొండ జిల్లాలోని యాదగిరి నుండి జిల్లాలోని ములుగు రోడు వరకు జాతీయ రోడ్లను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. తెలంగాణలో వివిధ పథకాల కింద చేస్తున్న అభివృద్ది పనులు త్వరలోనే కార్యరూపం దాలుస్తాయని అన్నారు.