కార్మిక సంక్షేమాన్ని విస్మరించడం తగదు

విజయవాడ,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని సీఐటీయూ నేతలు మరోసారి పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు సంఘటితం కావాల్సిన ఆవసరం ఉన్నదని అన్నారు. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసేవరకు ఉద్యమాలు చేస్తామని వారు తెలిపారు. పోరాటాలతో సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. దేశంలోని అసంఘటిత రంగ కార్మికులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

 

తాజావార్తలు