కార్యకర్తలను కన్న బిడ్డల్లా చూసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ

-ఎఫ్ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
జగదేవ్ పూర్, జూలై 19 జనం సాక్షి:
కార్యకర్తలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ  వారికి ఎల్లవేళలా అండగా ఉంటున్నది టీఆర్ఎస్ పార్టీయేనని  రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ లు పేర్కొన్నారు.  మంగళవారం సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్    మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన గజం శ్రావణ్, జగదేవ్ పూర్ కు చెందిన రాగుల రాములు  ప్రమాదవశాత్తు  మృతిచెందగా వారి కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ తరపున రెండు లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు పార్టీ నుంచి రూ.2 లక్షల సాయం అందుతుందన్నారు. పేద కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత టిఆర్ఎస్ పార్టీది అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలతో టీఆర్ఎస్ పార్టీ అజేయ శక్తిగా నిలిచిందని పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో  దాదాపు 96 వేల సభ్యులతో ఓటమి ఎరుగని పార్టీగా ఎదిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెరుగు బాలేశం గౌడ్, జెడ్పిటిసి వంటేరు సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పనగట్ల శ్రీనివాస్ గౌడ్, గజ్వేల్ ఏఎంసి వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్  రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కావ్య దర్గయ్య, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు రాచర్ల నరేష్  ఎంపీటీసీ కవితా శ్రీనివాస్ రెడ్డి నాచారం దేవస్థానం డైరెక్టర్ బుద్ధ నాగరాజు,  సర్పంచులు  ఏ యాదవరెడ్డి ఆర్ చంద్రశేఖర్  పీఏ సీఎస్   డైరెక్టర్ భూమయ్య, నాయకులు బట్టు దయానందరెడ్డి బుద్ద మహేందర్  పనగట్ల లక్ష్మణ్  జంగని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.