కార్యకర్తలను గుర్తిస్తేనే భవిష్యత్: వీహెచ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే ముఖ్యమంత్రి కూడా కార్యకర్తలతో మమేకం కావాల్సిన అవసరం ఉందని సీనియర్ నేత వీహెచ్ అన్నారు. కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశాంలో వీహెచ్ మాట్లాడారు. కార్యకర్తలను గుర్తిస్తేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో సీఎం ఫోటో తో పాటు ఉప ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిందని అన్నారు. జైలు బద్ధలు కొట్టి జగన్‌ను బయటకి తీసుకువెళ్తామని వైకాపా నేతలు అంటున్నారని.. ఆయనేమన్నా గాంధీయా? అని మండిపడ్డారు. దేశంలో ఎఫ్‌డీఐలతో సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగవని అన్నారు.