కాళేశ్వరంతో మారనున్న దశ

సస్యశ్యామలం కానున్న జనగామ ప్రాంతం

జనగామ,జ‌నం సాక్షి ): దేవాదుల కంటే పదింతల పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేయిస్తున్నదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్‌, టీడీపీ అడ్డుకునేందుకు రైతులను రెచ్చగొట్టి హైకోర్టులో, గ్రీన్‌ ట్రిబ్యూనల్‌లో కేసులు వేయించాయని ఆయన ఎద్దేవా చేశారు. రైతును రాజు చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ఎకరాకు రూ.4 వేలు అందించేందుకు నిర్ణయించారని తెలిపారు. దుర్భిక్ష ప్రాంతమైన జనగామను సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తరలిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు చెప్పడమే గాకుండా ఆ మేరకు పనులు చేయిస్తున్నారని తెలిపారు. గోదావరిపై మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్నప్రాజెక్టు పూర్తయితే 200 టీఎంసీల నీటిని సాగు, తాగునీటికి అందించొచ్చని ఆయన స్పష్టం చేశారు. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి 200 టీఎంసీల నీటిని వినియోగంలోకి తెస్తేఉత్తర తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఏడాదిలో రెండు పంటలకు ఢోకా ఉండదని అన్నారు. దేవాదుల కంటే పదింతల పెద్ద ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లు పనిచేయిస్తున్నామని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో దేవాదులను 16ఏళ్లు నిర్మిస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం 16నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ముందుకు పోతుంటే ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు రైతులను రెచ్చగొట్టి హైకోర్టులో, గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసులు వేశాయని అన్నారు. రాబోయే మరో 20 ఏళ్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఉద్యమ నేత కేసీఆర్‌ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలువబోతోందని అన్నారు. రుణ మాఫీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఎరువులు, విత్తనాలకు పెట్టుబడులతో ఓపీ, బీసీ, ఎస్సీ అనే తేడా లేకుండా రైతును రైతుగా కుల, మత బేధాలు లేకుం డా సీఎం కేసీఆర్‌ ఎకరాకు రెండు పంటలకు రూ.8వేలు పెట్టుబడుల కోసం చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు.