కాశీకి సైకిల్ పై వెళ్తున్న యాత్రీకునికి సన్మానం.
నెరడిగొండ ఆగస్టు14(జనంసాక్షి):
అందురు సుఖ సంతులతో ఉండాలని ఆర్మూర్ ప్రాంతానికి చెందిన రాజగౌడ్ ఆర్మూర్ నుండి ఉత్తర ప్రదేశ్ లోని కాశికి వెళ్తున్న సైకల్ యాత్ర ఆదివారం రోజున నెరడిగొండ మండలంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న కుఫ్టీ గ్రామానికి సైకిల్ యాత్ర చేరుకునట్లు తెలుసుకున్న సామాజిక కార్యకర్త కొయ్యడి గంగయ్య అతని ఆహ్వానించి ఙ్ఞాపకార్థంగా పార్కులో మొక్కలు నాటించి శాలువాతో సత్కరించారు.సమసమాజం కోసం చేస్తున్న వారి ఈ సైకిల్ యాత్ర విజయవంతం కావాలని సామాజిక కార్యకర్త కొయ్యడి గంగయ్య విడిసి చైర్మెన్ నవీన్ చారి కుంటల రాజగౌడ్ తదితరులు కోరారు.