కిరాణ వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడొద్దు, వాడితే జరిమాన, కేసులు

– మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్
భీమ్‌గల్‌, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) : భీమ్‌గల్‌ పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశంను మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ నుండి దేశం మొత్తం ప్లాస్టిక్ కవర్స్ నిషేధించడం జరిగింది. అందులో భాగంగానే పట్టణంలోని దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లను సాధించాలన్నారు. ప్లాస్టిక్ కవర్లను బదులు గన్ని బ్యాగులు వాడాలి అన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడినచో మున్సిపల్ చట్టం ప్రకారం జరిమానా విధించి కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. మటన్ మార్కెట్ యజమానులకు ప్లాస్టిక్ కవర్స్ వాడవద్దని హెచ్చరించారు. పట్టణంలోని బతుకమ్మ చీరల పంపిణీ కేంద్రాలను మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ తనిఖీ చేశారు. మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఆయనతో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.