కిసాన్ సమ్మాన్ విధివిధానాల్లో మార్పులు
మారిన నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలి
న్యూఢల్లీి,నవంబర్11(జనం సాక్షి): దేశ వ్యాప్తంగా అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పంచడానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6 వేల వరకు ఆర్థిక భరోస కల్పిస్తున్నాడు. అయితే నేరుగా ఈ డబ్బులను రైతుల ఖాతాల్లోకి పంపుతారు. కానీ విడతల వారిగా వీటిని అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి పంపిస్తారు. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంలో పలు మార్పులు చేర్పులు చేశారు. తాజాగా మారిన రూల్స్ విధానం ప్రకారం పొలం ఎవరి పేరు విూద ఉంటుందో ఆ రైతులు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ప్రయోజనాలు వర్తిస్తాయి. అంటే పూర్వీకుల భూమిలో భాగస్వామ్యం ఉన్నవారు ఇకపై పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందలేరు. విూ పేరు విూద పొలం ఉన్నట్లయితే వెంటనే కొన్ని పనులు చేయాలి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ నగదు.. విడతల వారిగా రైతుల ఖాతాల్లోకి జమవుతుంది. అందులో ప్రతి సంవత్సరం మొదటి విడత ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు.. రెండవ విడత.. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు.. మూడవ విడత.. డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు వస్తుంది. ఇక మారిన రూల్స్ ప్రకారం.. పీఎం కిసాన్ పథకం కింద కొత్తగా రిజిస్టేష్రన్ చేసుకున్న రైతులు ఇప్పుడు దరఖాస్తు ఫారంలో తమ భూమి ఎª`లాట్ నంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త నిబంధనలు పాత లబ్దిదారులపై ప్రభావం ఉండదు. ఈ పథకంలో నమోదు చేసుకోవడం చాలా సులభం.. ఆన్?లైన్లో ఇంట్లో కూర్చోని ఈ పక్రియను పూర్తిచేయవచ్చు. ఈ పథకం కోసం పంచాయతీ కార్యదర్శి లేదా పట్వారీ లేదా స్థానిక కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.