కీలక మలుపు తిరుగుతున్న శ్రీరెడ్డి వ్యవహారం
తనతల్లిని దూషించిన తీరుపై పవన్ సీరియస్
న్యాయపోరాటం దిశగా అడుగులు
అదే సందర్భంలో వర్మతో అవిూతువిూకి సిద్దం
ఫిల్మ్ ఛాంబర్‌కు తరలివచ్చిన మెగా ఫ్యామిలీ
పవన్‌కు మద్దతుగా కదలి వచ్చిన మా సభ్యులు
హైదరాబాద్,ఏప్రిల్20(జనంసాక్షి): శ్రీరెడ్డి వ్యవహారం కీలక మలుపులు తిరుగుతున్న వేళ రామ్‌గోపాల్ వర్మ కామెంట్..వాటిని తీవ్రంగా అల్లు అరవంద్ ఖండించడం.. ఓ ఎత్తయితే తన తల్లిని నిందించిన వారితో అవిూతువిూ తేల్చుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్దం అయ్యారు. ఉద్వేగంగా పోస్ట్‌లు పెట్టిన గంటల వ్యవధిలోనే సంచలన పవన్ నిర్ణయం తీసుకున్నారు. తనపై జరుగుతున్న కుట్రలపై న్యాయపోరాటానికి దిగాలని పవన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఫిలించాంబర్‌లో న్యాయవాదులతో పవన్ సమావేశమయ్యారు. పవన్ వెంట నాగబాబు కూడా ఉన్నారు. ‘మా’ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. తన తల్లిని దూషించిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలన్నదే పవన్ అభిమతంగా కనిపిస్తోంది. ఫిలించాంబర్‌లో పవన్ మౌన పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా సమాచారం. ఫిలించాంబర్‌కు పవన్ వచ్చిన విషయం తెలియడంతో అభిమానులు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. పవన్ తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై, ఆ వ్యాఖ్యలు తానే చేయించానని చెప్పిన రాంగోపాల్ వర్మపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుతో కలసి ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిరసన దీక్షకు దిగారు. పవన్ నల్లదుస్తులు ధరించి నిరసనకు దిగారు. అలాగే ఫిల్మ్ ఛాంబర్‌లో న్యాయవాదులతో పవన్ భేటీ అయ్యారు. దీంతో పవన్ న్యాయపోరాటానికి సిద్దమవుతున్నాట్టు సమాచారం. అల్లు అరవింద్ కూడా ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకొని పవన్‌కు మద్దతు ప్రకటించారు. ఇండస్ట్రీపై ఇంత జరుగుతున్నా సినీ ప్రముఖులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. సినీ ప్రముఖులంతా సమావేశానికి రావాలని పవన్ కోరారు. హీరో అల్లు అర్జున్ ఫిలించాంబర్‌కు రావడం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్, నాగబాబు చాంబర్‌కు చేరుకున్న సమయంలోనే అల్లుఅర్జున్ కూడా రావడంతో మెగా ఫ్యామిలీకి మద్దతుగా బన్నీ వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఫిలించాంబర్‌లోని ఓ హాల్‌లో నాగబాబు, పవన్ కల్యాణ్ కలిసి న్యాయవాదులతో చర్చిస్తుంటే.. అల్లు అర్జున్ మాత్రం బయటే ఉన్నట్లు తెలిసింది. అయితే అల్లు అర్జున్ చాంబర్‌కు వచ్చిన సమయంలో పవన్ బన్నీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ పరువుప్రతిష్టలకు సంబంధించిన విషయం కావడంతో అల్లు కుటుంబం కూడా కలిసి నడవాలని నిర్ణయించింది. శ్రీరెడ్డి వివాదంలో తన తల్లి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పవన్ ట్విటర్ వేదికగా ఖండించిన సంగతి తెలిసిందే. తన సోదరుడు నాగబాబు, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజాతో కలిసి వచ్చిన శుక్రవారం ఫిలిం ఛాంబర్ వద్దకు పవన్ విూడియా వ్యవహారశైలిపై నిరసన తెలిపారు. శ్రీరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయడం, తర్వాత పునరుద్ధరించడం తదనంతరం పరిణామాలపై ఆయన ‘మా’ సభ్యులతో చర్చించారు. శ్రీరెడ్డి వ్యవహారంలో విూడియా ప్రదర్శించిన అత్యత్సాహంపై పవన్ ఉదయం నుంచి ట్వీట్లు చేస్తున్నారు. టీఆర్‌పీ రేటింగుల కోసం ఛానళ్లు పాకులాడుతున్నాయని.. ప్రస్తుతం వారు చెప్పిందే వేదంలా మారిందని అసహనం వ్యక్తం చేశారు. పవన్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక తానున్నానని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించడంపై మెగా కుటుంబం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ వివాదంలో తనను అనవసరంగా లాగడం, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. ‘నాపై
ఆరోపణలు చేస్తున్నవారికి, చేయిస్తున్న వారికి అమ్మలు, అక్కలు, కోడళ్లు ఉన్నారు. కానీ వారి ఇంట్లో మహిళలే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. టీఆర్‌పీలు, రాజకీయ లాభాల కోసం వయసైపోతున్న నా 70 ఏళ్ల తల్లిని దూషిస్తున్నారు. విూరంతా టీఆర్‌పీల కోసం షోలు నిర్వహిస్తున్నారు కదా? మంచిది. వీటన్నింటికంటే మించిన షోను విూకు చూపిస్తాను. నేను నటుడి కంటే ముందు, రాజకీయ నేత కంటే ముందు ఓ అమ్మకు బిడ్డను. ఓ కొడుకుగా నా తల్లి గౌరవాన్ని కాపాడుకోలేకపోతే బతకడం కంటే చావడం మంచిది’ అంటూ పవన్ చేసిన ట్వీట్ ఆయన మనోవేదనను తెలియజేస్తోంది.