కుంటాల జలపాతాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల.
నెరడిగొండఆగస్టు23(జనంసాక్షి):
కుంటాల జలపాతం అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి పరుషోత్తం రూపాల అన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రోజున నేరడిగోండ మండలంలోని కుంటాల జలపాతాన్ని సందర్శించారు.ఆయనకు మండల కేంద్రంలోని కుంటాల ఎక్స్ రోడ్డు వద్ద బీజేపీ మండల శాఖ తరపున స్వాగతం పలకడం జరిగింది.కుంటాల జలపాతాన్ని సందర్శించి అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు.కుంటాల గ్రామ ఎకో కమిటీ సబ్యుల వినతి కోరికల మేరకు కుంటాల జలపాతం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఆయన వెంట జిల్లా ఎంపీ సోయం బాపురావు బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు సాకటి దశరథ్ జిల్లా మహిళ అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి రిటైర్డ్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు నల్ల రత్నాకర్ రెడ్డి రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాధవ్ తోపాటు వివిధ మండల పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఎకో కమిటీ అధ్యక్షుడు నర్సయ్య రాథోడ్ రమేశ్ గ్రామ సర్పంచ్ అశోక్ మాజీ సర్పంచ్ నారాయణ తదితరులు ఉన్నారు.