కుక్కల దాడిలో దుప్పి మృతి
భూపాలపల్లి,మే28(జనం సాక్షి ): వాజేడు మండలం ధర్మవరం గ్రామంలో కుక్కలు రెచ్చిపోయాయి. గ్రామంలోకి వచ్చిన దుప్పిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో దుప్పి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే దుప్పి తాగునీటి కోసమే గ్రామంలోకి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అడవుల్లో నీటి లభ్యత లేకపోవడంతో దుప్పిలు తరచూ గ్రామాల్లోకివస్తున్నాయి. దీంతో కుక్కుల దాడి చేశాయని గ్రామస్థులు అంటున్నారు. దుప్పి మృతదేహాన్ని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు అప్పజెప్పారు.
—–