కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి : సీపీఐ పోతిరెడ్డిపల్లి గ్రామసభలో నీలదీత

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 26 : చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి
గ్రామంలో కుక్కల బెడదను వెంటనే నివారించాలని గ్రామ సభలో తీర్మానం చేసి ఎజెండాగా రూపొందించి వెంటనే అమలు చేయాలని సీపీఐ మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి గ్రామ సభలో అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోతిరెడ్డి పల్లె గ్రామంలో కుక్కల బెడద విపరీతంగా పెరిగి స్వైర విహారం చేస్తున్నాయని, చిన్నపిల్లలు గ్రామ ప్రజలపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే కుక్కలను అడవిలోకి వదిలేసి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలని, లేదంటే రాబోయే రోజుల్లో చిన్నపిల్లలు, వృద్ధులకు కుక్కలు దాడి చేయడం వల్ల ఇంజక్షన్ లేకపోవడం కారణంగా
సిద్దిపేట, చేర్యాల, కొమురవెల్లి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని వెంటనే గ్రామ సభలో ఎజెండ రూపొందించి కుక్కలను బెడదను నివరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కత్తుల కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శి పల్లె రజిత, వార్డు సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.