కుమ్ములాటల వల్లే కాంగ్రెస్ ఓటమి:సర్వే సత్యనారాయణ
వరంగల్: పార్టీలో కుమ్ములాటల వల్లే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. ఆయన వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ… సీఎం సీటు కోసం 12 మంది పోటీ పడ్డారన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లడం వల్లే గెలిచారని, కాంగ్రెస్ నేతల బుద్ధి ఇప్పటికీ మారడం లేదన్నారు. అమ్మ ఆదేశిస్తే వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని సర్వే పేర్కొన్నారు. జానారెడ్డి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. దేశానికి ,రాష్ట్రానికి జానారెడ్డినాయకత్వం అవసరం అని తెలిపారు.