కులం పేరుతో దూషించిన ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్.
నెరడిగొండ ఆగస్టు5(జనంసాక్షి):
నిర్మల్ జిల్లాలోని పెంబి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జాదవ్ లక్ష్మన్ ను కులం పేరుతో దూషించి దాడి చేసి బూటుతో తన్నిన పెంబి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా లైవ్ అధ్యక్షుడు జాధవ్ మహేందర్ అన్నారు.హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ కు న్యాయం చేయాలని శుక్రవారం రోజున నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీఎస్పీ జీవన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుడైన హెడ్ కానిస్టేబుల్ లక్ష్మన్ ని కులం పేరుతో దూషించి బూటు కాలితో తన్ని దుర్బర్షాలాడిన ఎస్ఐ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే న్యాయం చేయాలని లేని పక్షంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేయవలసి వస్తుందని వారు పేర్కొన్నారు.వినతి పత్రం సమర్పించిన వారిలో ఆదిలాబాద్ జిల్లా లైవ్ అధ్యక్షుడు మహేందర్ జాధవ్ లంబాడి జేఏసీ నాయకులు తదితరులు ఉన్నారు.