కులవృత్తులకు ఎన్నడూ లేని ప్రాధాన్యం

                                                              చేప విత్తనాల పంపిణీతో ఎదుగుదున్న ముదిరాజ్‌లు
ఎంపీ బండా ప్రకాశ్‌
వరంగల్‌,మే29(జ‌నం సాక్షి): సీమాంధ్ర పాలనలో కనుమరుగు అయిన కుల, చేతి వృత్తుల బలోపేతానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌ అన్నారు.  సంక్షేమ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో చదువుకున్న వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు కుల, చేతి వృత్తులపై ఆసక్తి చూపే పెద్దవారికి పథకాల్లో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. తెలంగాణలో రైతురాజ్య స్థాపనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న సంబురంగా వ్యవసాయం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో రైతుబంధు పథకం
ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల సహకార సంఘాలకు సొంత భవనాలు ఉన్నాయని అన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం 650సహకార సంఘాలకు భవనాలు నిర్మించిందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే కరువు ప్రాంతమైన జనగామ నియోజకవర్గాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసిన ఘనత కెసిఆర్‌కే  దక్కుతుందన్నారు. వేసవిలోనూ చెరువులను గోదావరి జలాలతో నింపారని అన్నారు. ముదిరాజ్‌లకు ఏ రాష్ట్రంలో నూ ఉచితంగా చేప పిల్లలు అందించిన ప్రభుత్వాలు లేవన్నారు. తెలంగాణ ప్రభుత్వం చెరువుల్లో చేపపిల్లలతో పాటు విత్తనాలు అందిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ముదిరాజ్‌ల అభివృద్ధి, సంక్షేమానికి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. మత్స్యకార్మికులకు 2015 సంవత్సరం నుంచే చేప పిల్లలు అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. మొదటగా 30 కోట్లు, తర్వాత 50 కోట్లు, ప్రస్తుతం 80కోట్ల చేప పిల్లలు అందించిందని, వచ్చే ఏడాది ఆ సంఖ్య 150 కోట్లకు చేరుకుంటుందన్నారు. ముదిరాజ్‌లు చేపలను మొదటగా గ్రామంలోని ప్రజలకు అమ్మిన తర్వాతనే మార్కెట్‌కు తరలించాలన్నారు. రైతుబంధు పథకం అమలుతో కాంగ్రెస్‌, టీడీపీలు తెలంగాణలో భూస్థాపితం కానున్నాయని అన్నారు. ఏ ఊర్లో చూసినా పెట్టుబడి సాయం గురించే మాట్లాడుకుంటున్నారని అన్నారు. చెక్కులు విడిపించుకుని రైతన్నలు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారని అన్నా రు.