కూలి, భూమి పోరాటాలు ఉదృతం
*కనీస వేతన జిఓ మార్చాలి
*మహాసభలో నారి ఐలయ్య
మిర్యాలగూడ, జనం సాక్షి
కూలి భూమి పోరాటాలు ఉధృతం చేస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య తెలిపారు. ఆదివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం మిర్యాలగూడ పట్టణ మండల మహాసభ నిర్వహించారు. ముందుగా సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013లో కనీస వేతన జీవో తీసుకొచ్చారని ప్రతి రెండు ఏళ్ళ కొకసారి జీవో మార్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ తొమ్మిదేళ్ల కాలంలో జీవోను మార్చలేదన్నారు. దీంతో ఆనాడు చేసిన కూలి రేట్లే నేటికీ అమలు అవుతున్నాయని వాపోయారు పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యాలలో అనుగుణంగా కూలి రేట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కూలి రేట్లు పెంచుకునేందుకు జీవోను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. రోజుకు కూలి రేటు 600 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఇళ్ల స్థలాలు లేని వ్యవసాయ కూలీలకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ప్రభుత్వం విక్రయిస్తూ రియేటర్లకు కార్పొరేట్ వ్యాపారస్తులకు కట్టబెడుతుందని విమర్శించారు. గతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వం ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకోవడం అన్యాయమని ఇళ్లస్థలాలు కేటాయించి వారికి తక్షణమే డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్ మాట్లాడుతూ పనిచేసిన 15 రోజుల్లో పై కూలీ ఇవ్వాలని కోరారు. కూలీలకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చట్ట రక్షణ కోసం జరిగే ఉద్యమంలో పెద్ద పేదలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. దోపిడికి వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ కూలీలు ఐక్యంగా ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు ఏవిధంగా ఉద్యమాలు చేయాలని కోరారు.
నూతన కమిటీ ఎన్నిక
వ్యవసాయ కార్మిక సంఘం మిర్యాలగూడ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా కందుకూరి రమేష్, కార్యదర్శిగా పిల్లుట్ల సైదులు, కోశాధికారిగా బొంగరాల వెంకటయ్యను ఎన్నుకున్నారు వీరితో పాటు 17 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షులుగా ఎస్ కే బీబమ్మ ప్రధాన కార్యదర్శిగా రాజారాం ఉపాధ్యక్షులుగా సోమయ్య సహకార దర్శిగా శేషమ్మ లను ఎన్నుకున్నారు.
ఎస్కె బీబీమ్మ,బి వెంకటయ్య అధ్యక్షతన జరిగిన ఈ మాసభలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డా. మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, రవి నాయక్, ఆయూబ్, పరుశురాములు, పాపి రెడ్డి, లెంకల మాధవ రెడ్డి, ఊర్మిళ,బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు