కూలీలకు “కూలీ బంధు” ప్రకటించాలి
వ్య.కా.స జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 19 : కూలీలకు కూలి బందు ప్రకటించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్ళబండి శశిధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేర్యాల మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల మూడవ మహాసభ మల్కని ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించారు. మహాసభలో శశిధర్ మాట్లాడుతూ.. ఉపాధి కూలీ పనులకు వెళ్తే కూలీ గిట్టుబాటు కావడం లేదని, చేసిన పనులకు నెలలు గడుస్తున్నా డబ్బులు రావడం లేదన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరల కు అనుగుణంగా రోజు కూలీ రూ. 600 పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి కూలికి 200 పని దినాలు కల్పించాలని, అర్హులైన వారందరికీ పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు.కూలీలకు డబుల్ బెడ్ రూం లు,ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు,స్థలం లేనివారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్య కా స జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట మావో, శ్రామిక మహిళా జిల్లా అధ్యక్షురాలు దాసరి కళావతి,రాంసాగర్ సర్పంచ్ తాడూరి రవీందర్, వ్యకాస నాయకులు గొర్రె శ్రీనివాస్, బోయిని మల్లేశం,జిడాల సత్తవ్వ, ఆలేటి బాలమణి, తాడూరి రవీందర్, ఎస్.కె ఆదిల్, జిడాల చంద్రయ్య,తాడూరి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area