కెసిఆర్ కానుకగా బతుకమ్మ చీరలు

 ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
స్టేషన్ ఘనపూర్, (చిల్పూర్), సెప్టెంబర్ 24, ( జనం సాక్షి ) :
ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీర లు కానుకగా అందిస్తున్నారని తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. చిల్పూర్ మండలంలోని మ ల్కాపూర్ గ్రామంలోని మల్కాపూర్ బతుకమ్మ ఘాట్  వద్ద టిఆర్ఎస్ మండల సమన్వయకర్త పోలేపల్లి రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో,గ్రామ సర్పంచ్ కొంగర రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావే శానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య,టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డితో కలి సి మల్కాపూర్ గ్రామానికి సంబంధించిన, పరిసర గ్రామాలకు సంబంధించిన ఓల్డ్ పింఛన్లకు సంబం ధించిన ఆసరాపింఛన్ కార్డులను,తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ ఉచి తంగా పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సంధ ర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారుమాట్లా డుతూ తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి ఒక ఆడపడుచు దసర పం డుగ నాడు కొత్త చీర కట్టుకుని బతుకమ్మ అడాల నే ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళను,అక్కా చెల్లెళ్ళు గా భావించి ఈ  చీరలను పంపిణి చేసే బ్రహొత్తర మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికుల కు ఉపాధి కల్పించిందని, టిఆర్ఎస్ ప్రభుత్వం అ న్ని మతాలను గౌరవిస్తుందనీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్న కేసీఆర్ కి రుణ పడి ఉండాలని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని అభి వృద్ది మనరాష్ట్రంలో జరుగుతుంది అని,ప్రతి పేద కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలన్నదేసీఎం ఆశయమని అన్నారు.దేశంలో ఎక్కడా లేని విధం గా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత కెసిఆర్ కేదక్కిందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యం గా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుంద న్నారు. కృష్ణాజిగూడెంగ్రామంలో బతుకమ్మ చీర లు, పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. ఆనతరం చిల్పుర్ మండలంలోని అన్ని గ్రామాల్లో జెడ్పీ నిధుల ద్వారా మంజూరైన 20 లక్షల రూపాయల తో హైమక్స్ లైట్స్ ఏర్పాటు చేస్తామని జడ్పీ చైర్మ న్ పాగాల సంపత్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవల్లి కృష్ణ రెడ్డి, ఎంపిపి సరితబాలరాజు,చిల్పుర్ దేవస్థాన కమిటీ చైర్మన్ శ్రీధర్ రావు, మండల  అధ్యక్షుడు రమేష్ నాయక్,టిఆర్ఎస్ మండల సమన్వయకర్త పోలె పల్లి రంజిత్ రెడ్డి,పిఏసిఎస్ వైస్ చైర్మన్ నాగరాజు
,నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ రంగు రమేష్, మార్కెట్ డైరెక్టర్లు రాజన్ బాబు, రంగు హరీష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.