కేంద్రం నిధులపై ఆర్టిఐ దరఖాస్తు
కొండపాక (జనం సాక్షి) జులై 21: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి గత ఏడు సంవత్సరాలుగా వివిధ వేతన సంవత్సరం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులపై కొండపాక ఎంపీడీవో కార్యాలయంలో బిజెపి శ్రేణులు ఆర్, టీ, ఐ దరఖాస్తు అందజేశారు. బిజెపి రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి 2014 ఆర్థిక సంవత్సరం గ్రామపంచాయతీలకు ఎన్ని నిధులు మంజూరు అయ్యాయి కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపులు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం నిధుల వివరాలు కేంద్ర బడ్జెట్ తో నిర్మించిన రహదారుల వివరాలు వైకుంఠ దామాలు మరుగుదొడ్లు రైతు వేదికలు పెద్ద రైతు సంక్షేమ పథకాల వివరాలు తెలియపరచాలన్నారు. బిజెపి మండల అధ్యక్షుడు శశిధర్ రెడ్డి రాష్ట్ర ఓబిసి కల్చరల్ కన్వీనర్ నందాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి పేరుతో కొండపాక ఎంపీడీవో కార్యాలయ అధికారికి మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శినీకి దరఖాస్తు పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజేవైఎం మెదక్ పార్లమెంట్ జోనల్ ఇంచార్జ్ శ్రీనివాస్, గండమీద రామ స్వామి, వెలికట్టే సురేష్, మనోహర్, తిరుపతి పాండు, నరేష్, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.




