కేంద్రం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుంది

డోర్నకల్ ఆగస్టు 16 జనం సాక్షి

ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తున్న మోదీ ప్రభుత్వం నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.సిపిఐ మండల కార్యవర్గ సమావేశం జరగగా సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలైన ఈడి,సిబిఐ లాంటి రాజ్యాంగ సంస్థలను వాడుకొని ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే కుట్రలతో విభజన రాజకీయాలతో మత విద్వేషాలను రెచ్చగొడుతూ  అధికార విస్తరణనే ధ్యేయంగా కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ పాలన సాగిస్తున్న మోదీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని అన్నారు.ఏటా కోటి ఉద్యోగాలు, విదేశాలలోని నల్ల డబ్బు తీసుకురావడం,వంద రోజుల్లో ధరలు తగ్గిస్తానని నినాదాలు నీటి మూటలుగా మారాయని,ప్రజా సంపద కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతూ ప్రజలపై మునుపెన్నడూ లేని విధంగా పన్నుల మూత  మోగిస్తున్నారని విమర్శించారు.ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శిగా గుంశావలి ని ఎన్నుకోవడం జరిగినది.మండల కార్యదర్శి తురక రమేష్,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్,ప్రబేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు